Fish Venkat : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. అప్పటి వరకు డాయలసిస్ చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఫిష్ వెంకట్ ఆరోగ్యంపై రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఫిష్ వెంకట్ ను పరామర్శించారు. సరైన వైద్యం అందేలా చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మైనపంల్లి హనుమంత రావు కూడా ఫిష్ వెంకట్ ను పరామర్శించారు. కాగా.. ప్రభాస్ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ప్రభాస్ సాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయని వాపోయారు. సాయం చేయాలని కోరారు. <br />#fishvenkat <br />#fishvenkatwife <br />#prabhas